Ooru Erayyindi Eru Horettindi

ఊరు ఎరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది
ఊరు ఎరయ్యింది ఏరు హోరెత్తింది
ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది
భేరీలు బురాలు తప్పేట్లు తాళాలు హోరెత్తే కోలాహలంట

(ఈరేడు లోకాలు యేలేటి మారేడ
ఊరేగి రావయ్యా మావాడ కివెలా
పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్లే అవ్వాలా
కానోళ్ళనే మాట లేకుండా పోవాలా)

(తోబుట్టువింటికి సారే ఎత్తుకెళ్ళి
సాకెత్తుకొచ్చావా మా గడపకి
మాలక్ష్మి మగడా ఏమిచ్చి పంపాలా
నీవిచిందేగా మాకున్నది)

(కదిలేటి రథచక్ర మేమన్నదంట)

కొడవళ్లు నాగళ్లు చేసే పనంట
భూదేవి పూజే కదా
ఏ వేదమైన ఎవరి స్వేదమైన
ఆ సామి సేవే కదా
కడుపారా ఈ మన్ను కన్నోళ్లే అంట
కులమొచ్చి కాదంటాదా
ప్రతి ఇంటి పెళ్లంటిదీ వేడుక
జనమంతా చుట్టాలే కదా

(ఈరేడు లోకాలు యేలేటి మారేడ
ఊరేగి రావయ్యా మావాడ కివెలా
పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్లే అవ్వాలా
కానోళ్ళనే మాట లేకుండా పోవాలా)

వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాలా
తారంగా వాడే ఈ కేరింతల్లోన
ఈ పంచకా పంచకె కంచెలున్న జరపాలా ఈ జాతర
వెయ్యమడలు దాటి సయ్యాటలుయ్యాలా
మా చెలిమి చాటించగా
ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా
మనలాగే ఉండాలనుకోదా

(ఈరేడు లోకాలు యేలేటి మారేడ
ఊరేగి రావయ్యా మావాడ కివెలా
పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్లే అవ్వాలా
కానోళ్ళనే మాట లేకుండా పోవాలా)



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Chirrantan Bhatt
Lyrics powered by www.musixmatch.com

Link