Naina Naina

सुन सुन मेरी నైన love సరిగమలే నాలోన
सुन सुन మొదలయెన చిరు పదనిసలే నీ వలన
सुन सुन జత పడనా తొలి గుసగుసలే పిలిచేన

నైన నైన ఆ బాపు బొమ్మవు నువ్
నైన నైన నందూరి ఎంకివి నువ్
నైన నైన వేటూరి పాటవు నువ్
జాబిలమ్మే సిగ్గుపడి దాచుకుంటుంది నిన్ను చూస్తే
జాజిమల్లె మూతి తిప్పి ముడుచుకుంటుంది నిన్ను చూస్తే
మన్మధుడే మతి చెడి మందు కొడతాడు నిన్ను చూస్తే
सुन सुन मेरे నైన గల గల పలుకుల ప్రియ లలన
सुन सुन मेरे నైన మిల మిల వెలుగుల శశివదన
सुन सुन मेरे నైన తళ తళ సొగసుల తడిమేనా

అలా అలా నవ్వేసావే ఇలా ఇలా నచ్చేసావే
ఎలా ఎలా పట్టేసావ్ నను ప్రేమగా పడేసావ్
ఇలా ఎలా అందాలన్నీ సునామిలా ముంచినా
అమృతాలు తాగినంత తియ్యగా ఉంది నీ నవ్వే
వాలుతున్న పొద్దులోని ఎరుపులా ఉంది నీ పెదవే
కోనసీమ కొబ్బరాకు మెరుపులా ఉంది నీ మోమే
सुन सुन मेरे నైన గల గల పలుకుల ప్రియ లలన
सुन सुन मेरे నైన మిల మిల వెలుగుల శశివదన
सुन सुन मेरे నైన తళ తళ సొగసుల తడిమేనా

ఉగాదిలా వచ్చేసావే ఆనందాలు తెచ్చేసావే
హడావిడి చేసేసావ్ అనురాగమై వాలేసావ్
సరాసరి సింగారాన్ని శరాబిలా తాగిన
నీలి నీలి కళ్ళలోన బంది అయ్యింది నా మనసే
అల్లి బిల్లి వెన్నెలకి బానిసయ్యింది నా మనసే
మాయ చేసి గుండె దోచి ఎత్తుకెళ్ళింది నీ సొగసే
सुन सुन मेरे నైన గల గల పలుకుల ప్రియ లలన
सुन सुन मेरे నైన మిల మిల వెలుగుల శశివదన
सुन सुन मेरे నైన తళ తళ సొగసుల తడిమేనా



Credits
Writer(s): S S Thaman, Mallikarjun, Kandikonda
Lyrics powered by www.musixmatch.com

Link