Kanulanu Thaake

టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి

ఓ కనులను తాకే ఓ కల
చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
ఓ మనసును లాగే మాయలా
వేసే ఓ వలా
నీ నవ్వులే నేడిలా
ఓ హాయి నీలో ఉన్నా
నీలోనే ఉన్నా
నీ ప్రేమే నే కోరుకున్నా
నీలో ఉన్నా
నీ తోడై ఉన్నా
నిన్నే నే ప్రేమించినా

ఓ కనులను తాకే ఓ కలా ఓ

హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగా నాతో సాగేనా
నాలో రేగింది ఓ గాయమే
దారే చూపేన ఈ కాలమే ఏ ఏ ఏ
నీవే నేనా
నీ మౌనం నేనా
నీ ఊసే ఈ గుండెలోనా
నీతో లేనా ఆహా

ఓ కనులను తాకె ఓ కలా ఓ ఓ ఓ

(చంద ఓ చందమామ రావా)
(మా వెంటే రావా)
(పైనే నువ్వు దాక్కున్నావా)
(వాన ఓ వెన్నెల వాన రావా)
(నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా)
టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి

ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా
ఇంక ఈ జీవితం ఎందుకో
కంట కన్నీరు నింపేందుకో ఓ ఓ ఓ ఓ

నీతో రానా
నీ నీడై పోనా
నీ కోపం వెంటాడుతున్నా
నీలో లేనా ఆహా



Credits
Writer(s): Anup Rubens, A G Mani
Lyrics powered by www.musixmatch.com

Link