Mellaga (From "Varsham")

మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం

నీ మెలికెలలోన ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా

మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా
చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నినువిడగా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరుచినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైన

త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

మెల్లగా కరగనీ రెండుమనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటెతలపుల ద్వారం
వలపువానదారాలే పంపుతున్నది ఆకాశం
చినుకుపూలహారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం



Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link