Manasantha Nuvve - From "Manasantha Nuvve"

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట
ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట
ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హేహేహే హే హే హే హేహేహే హే

వయసుకే తెలియదే ఎన్నాళ్ళు గడిచిందని
పరికిణీ బొమ్మకి పైట చుడుతుందని
దూరమే చెప్పదే నీ రూపు మారిందని
స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని
ఇకపై మన కౌగిళింతకి
చలి చీకటి కంటపడదని
ఎపుడూ మన జంట గడపకి
కలతన్నది చేరుకోదని
కొత్తగా తెలుసుకున్నాననీ
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట
ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట
ఉందని తెలుసుకోమ్మా

రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా
ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా
పక్కనే ఉండగా కన్నెత్తి
నను చూడక
దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా
ప్రాణానికి రూపముందని
అది నువ్వై ఎదురయ్యిందని
ప్రణయానికి చూపు ఉందని
హృదయాన్నది నడుపుతుందని
విరహమే తెలుసుకోవాలని
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట
ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట
ఉందని తెలుసుకోమ్మా

మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
హేహేహే హే హే హే హేహేహే హే



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link