Andala Chukkala

హే' అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి
ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి
లక్కీగా రైల్లో కలిసిందా

శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం
తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం

I Love You ఓ శ్రావణి
నా కోసం నువ్వు పుట్టావని
I Love You ఓ శ్రావణి
నాతోనే నువ్వు ఉంటావని

హే' అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి
ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి
లక్కీగా రైల్లో కలిసిందా

హే' ముత్యం లాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు
బంగారంతో చేయిస్తా జడ పువ్వు
నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నాకివ్వు
పువ్వులతోనే పూజిస్తా అణువణువు

అరె' శీతాకాలం మంచుల్లో ఒళ్ళంటుందే జివ్వు
ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వు
అరె' వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వు
కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు

I Love You ఓ శ్రావణి
నా కోసం నువ్వు పుట్టావని
I Love You ఓ శ్రావణి
నాతోనే నువ్వు ఉంటావని

హే' అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి
ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి
లక్కీగా రైల్లో కలిసిందా

స్వర్గంలోనే పెళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళు
చెప్పిన మాటే విని ఉంటే నీ చెవ్వు
ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళు
అందరికింక శుభలేఖలనే పంచివ్వు

రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టొద్దే గడువు
నూరేళ్ళు నిను పరిపాలించే పదవే రాసివ్వు
మొత్తం నీపై పెట్టేశానే నా ఆశల బరువు
గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వు

I Love You ఓ శ్రావణి
నా కోసం నువ్వు పుట్టావని
I Love You ఓ శ్రావణి
నాతోనే నువ్వు ఉంటావని

హే' అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి
ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి
లక్కీగా రైల్లో కలిసిందా

శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
తన మౌనం ఐపోటే త్వరలో అంగీకారం
తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం

I Love You ఓ శ్రావణి
నా కోసం నువ్వు పుట్టావని
I Love You ఓ శ్రావణి
నాతోనే నువ్వు ఉంటావని



Credits
Writer(s): Sahithi, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link