Naa Gundello

నా గుండెల్లో నిండింది నువ్వే కదా
నా ఉహల్లో చేరింది నువ్వే కదా
నా కన్నుల్లో దాగుంది నువ్వే కదా
నా నీడల్లే మారింది నువ్వే కదా
యదను యదను ఏకం చేసే ఉందాం సదా
యదను యదను ఏకం చేసే ఉందాం సదా

నా గుండెల్లో నిండింది నువ్వే కదా
నా ఉహల్లో చేరింది నువ్వే కదా

ఏ రోజు లేదే ఇలా
యద మోగే సన్నాయిలా
ప్రేమంటే అంతే కదా
నిలువెల్లా కలలే ఇలా
నవ్వేటి జాబిలిని నా గుండెలోతుల్లో దాచాను నేనిప్పుడు
నీలోనే నేనుండి మది చేసే సవళ్లు వింటాను నేనిప్పుడు
నాలో నీలో ప్రతి అణువణువు ఒకటే కదా
నాలో నీలో ప్రతి అణువణువు ఒకటే కదా

నా గుండెల్లో నిండింది నువ్వే కదా
నా ఉహల్లో చేరింది నువ్వే కదా

దాగుంది మది మాటనా
నీ పైన ప్రియభావనా
హృదయాల తోలి స్పందన
కలిగింది చెలి కోసమా
నేనంటూ నాలోన లేనింక ఈనాడు
అయినాను నీ నీడను
ఆరారు కాలాలు విడిపోక ఏనాడూ అవుతాను నీ తోడునూ
ఇపుడు ఎపుడు ఇక మన ప్రేమ నిజమే కదా
ఇపుడు ఎపుడు ఇక మన ప్రేమ నిజమే కదా

నా గుండెల్లో నిండింది నువ్వే కదా
నా ఉహల్లో చేరింది నువ్వే కదా
నా కన్నుల్లో దాగుంది నువ్వే కదా
నా నీడల్లే మారింది నువ్వే కదా
యదను యదను ఏకం చేసే ఉందాం సదా
యదను యదను ఏకం చేసే ఉందాం సదా



Credits
Writer(s): Chakri, Kandikonda
Lyrics powered by www.musixmatch.com

Link