Ammai Nachesindhi

అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
వైశాఖమొచ్చేసింది ఇవ్వాళ రేపో అంది
ఓ మంచి మూర్తం చూసి సిద్ధం కమ్మంది

ఈ కబురు విన్న ఎదలో
ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరి కునుకే చెదిరి
మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
(కొమ్మల్లో చిలకా మోమాట పడక)
(వచ్చి వాలమ్మా)

అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది

ఈ గాలి రోజూలా వీస్తున్నా
ఈవేళ వేరేలా వింటున్నా
సన్నాయి రాగాలుగా
నా వైపు రోజూలా చూస్తున్నా
ఈనాడు ఏదోలా అవుతున్నా
నీ కన్ను ఏమన్నదో
నా ఈడు ఏం విన్నదో
ఆశ పెట్టి పెట్టి పెట్టి
చంపొద్దమ్మా ఇట్టా
నువ్వు పట్టి పట్టి పట్టి
చూస్తూ ఉంటే ఎట్టా
ఎన్నెన్నో అంటించి
ఉక్కిరి బిక్కిరి అవుతున్నా
(కొమ్మల్లో చిలకా మోమాట పడక)
(వచ్చి వాలమ్మా)

అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది

ముత్యాల మేనాలే రప్పించి
మేఘాల వీధుల్లో తిప్పించి
ఊరేగనీ హాయిగ
అందాల హద్దుల్నే తప్పించి
వందేళ్ల కౌగిల్నే అందించి
ఊరించు ఆ వేడుక
ఓ ఊహించని నన్నిలా
ఎంటి గిచ్చి గిచ్చి
రెచ్చ గొట్టేలా నువ్వూ
ఇంక పిచ్చి పిచ్చి పిచ్చి
పెంచేస్తొందే నువ్వూ హోయ్
కవ్వించి కరిగించి
కరిగే వయసుని కాపాడు
(కొమ్మల్లో చిలకా మోమాట పడక)
(వచ్చి వాలమ్మా)

అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది
ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది

ఈ కబురు విన్న ఎదలో
ఎన్నెన్ని పొడుపు కధలో
మనువే కుదిరి కునుకే చెదిరి
మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
(కొమ్మల్లో చిలకా మోమాట పడక)
(వచ్చి వాలమ్మా)



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link