Nuvvu Yevvari Yedalo

నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ, తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకీ, అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికి

కలతలే కోవెలై కొలువయే విలయమా
వలపులో నరకమే వరమనే విరహమా
తాపమే దీపమా వేదనే వేదమా
శాపమే దీవె నా నీకిదే న్యాయమా
కన్నీరు అభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా ప్రణయమా
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

రెప్పలే దాటదే ఎప్పుడూ ఏ కల
నింగినే తాకదే కడలిలో ఏ అల
నేలపై నిలవదే మెరుపులో మిలమిల
కాంతిలా కనబడే భ్రాంతి ఈ వెన్నెల
అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా
నీతో పయనమే పాపమా ప్రణయమా

నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ, తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకీ, అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికి

Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link