Chilakamma Mukkuki

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి
మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి
మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి

ఉందోయ్ రాసి

లేదోయ్ రాజీ

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది

సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిళ్ళే కూలినా బంధువులే పోయినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
చల్లే అక్షింతలు నిప్పులే అయినా పెళ్ళాగదు రాసే ఉంటే
హే మెడ్లో పూమాలలు పాములే అయినా పెళ్ళాగదు రాసే ఉంటే

ఉందోయ్ రాసి

వద్దోయ్ పేచీ

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది

తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటే
గురుడే బోధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటే
సింహం ఓ పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే
పెళ్ళాం ఓ పక్క పళ్ళెమోపక్క కథ మారదు రాసే ఉంటే

ఉందోయ్ రాసి

బ్రతుకే చీచీ

అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి
మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి
మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి

ఉందోయ్ రాసి

లేదోయ్ రాజీ

Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link