Yemantave Oh Manasa

ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశ
ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికాయా ఈ హైలో హైలెస్సా

సంకోచం చాలు అని ఇంకొంచం చేరమని చోటిచ్చిందా ఈ స్నేహం
అవకాశం చూసుకొని సావాసం పంచమని అందించిందా ఆహ్వానం
చినుకంత చిన్నతడి వెంటపడి వెళ్ళువగ మారిందా
అణువణువు తుళ్ళిపడి గుండె సడి ఝల్లు మని మోగిందా
ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా

మోమాటం కప్పుకొని ఏమాట చెప్పనని ఎన్నాళ్ళింకా ఈ మౌనం
జడివానై కమ్ముకొని సుడిగాలై చుట్టుకొని తరిమేయవా ఈ దూరం
ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట
నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట
ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస
ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశ
ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికాయా ఈ హైలో హైలెస్సా



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link