Kaani Ippudu

కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
హయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు మ్మ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను
కాని ఇప్పుడు మ్మ్
ప్రేమ కోసం ఏకంగ తాజ్ మహాలే కట్టాడు
షాజహాన్ కి పనిలేదా అనుకున్నాను
ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే
చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను
ఓ ఓ ఓ అరె ఇంతలో ఏదేదో జరిగిందిరో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడా తడిసానురో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
హయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు మ్మ్
హే పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను
కాని ఇప్పుడు మ్మ్

ఓ ప్రేయసి ఊహల్లో life అంతా గడిపేస్తూ
అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను
కాని ఇప్పుడు మ్మ్
Greeting card లకి cell phone బిల్లులకి
వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను
కాని ఇప్పుడు మ్మ్
గాలిలోన రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను
మాటి మాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను
ఓ ఓ ఓ అది ప్రేమని ఈరోజే తెలిసిందిరో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడా తడిసానురో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
హయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు మ్మ్

ఓ చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై
తికమక పెట్టేదొకటుందంటే నమ్మనే లేదు
కాని ఇప్పుడు మ్మ్
నీ కోసం పుట్టి నీ కోసం పెరిగే
హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు
కాని ఇప్పుడు మ్మ్
ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను
ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కడ్నే ఎందుకు miss అయ్యాను
ఓ ఓ ఓ ఈ రోజులా ఏ రోజు అవలేదురో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడ తడిసానురో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
హయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు మ్మ్
హే పగలే వెన్నెల కాస్తుందని ప్రేమికులంటుంటే
హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను
కాని ఇప్పుడు మ్మ్



Credits
Writer(s): Prasad Devi Sri, Ravi Kumar Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link