O Chandrama

ఓ చంద్రమా
మచ్చేలేని ప్రియబంధమా
ఏనాటికీ నన్నే వీడి పోబోకుమా
చెలి నీవే
నా ఆరోప్రాణం అంటున్నానే
కలకాలాలు నీతో చేరి ఉంటా నేనే
ఇక నీతోనే ఏకం అవుతూ
లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా
మచ్చేలేని ప్రియబంధమా
ఓ అందమా
నా ప్రియరాణి నీవే సుమా

ఓ గోరింకా నూరేళ్లింకా
తొడే నీవై ఉండాలిలే
ఓ నా మైనా ఏ జన్మానా
నీకే జంటై ఉంటానులే
నీ గుండెలోనా ఉన్నంత ప్రేమ
ఆ కళ్లలోనా చూశా ఈ వేళా
చేశాక నిలపాలి బాస ఓహొహో
ఇచ్చాక మాటా విడిచేనా బాట
విడిపోయే వరకు నా శ్వాసా

ఓ చంద్రమా
మచ్చేలేని ప్రియబంధమా
ఓ అందమా
నా ప్రియరాణి నీవే సుమా

అంతా నీకే సొంతం అవుతా
నీ ప్రేమంతా అందించుమా
అయితే నాకో ముద్దిస్తేనే
ప్రేమిస్తాలే ఓ నేస్తమా
నేడే నీతోనా నేనవుతూ వీణ
నీ పూలవాన స్వప్నాలలోనా
నిలువెల్లా పులకించిపోనా
నేనే నీవైనా ఆ వేణువులోనా
రాగాలు రవళించుకోనా

ఓ అందమా
నా ప్రియరాణి నీవే సుమా
ఏనాడికా నిన్నే వీడి పోలేనుగా
ఇక నీవే
నా ఆరో ప్రాణం అంటున్నాలే
కలకాలాలు నీతో చేరి వుంటా నేనే
సఖి నీతోనే ఏకం అవుతూ
లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా
ఓ అందమా



Credits
Writer(s): Mani Sharma, Sahithi
Lyrics powered by www.musixmatch.com

Link