Sirimallevaana

సిరిమల్లెవాన పడుతోంది లోన, కనిపించదే కంటికి
వడగళ్ళవాన ఉరిమింది ఐనా, వినిపించదే జంటకి
తడిసే తరుణాన గొడుగై నే లేనా, సిరిమల్లె...
సిరిమల్లెవాన పడుతోంది లోన, కనిపించదే కంటికి

వల అనుకోనా వలపనుకోనా కలిపిన ఈ బంధం
వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నే సొంతం
చినుకై వచ్చావే వరదై ముంచావే సిరిమల్లె...
సిరిమల్లెవాన పడుతోంది లోన, కనిపించదే కంటికి

చిలిపిగ ఆడి చెలిమికి ఓడి గెలిచా నీపైన
తగువుకి చేరి తలపుగ మారి నిలిచా నీలోన
మనసే ఈ వింత మునుపే చూసిందా, సిరిమల్లె...
సిరిమల్లెవాన పడుతోంది లోన, కనిపించదే కంటికి
వడగళ్ళవాన ఉరిమింది ఐనా, వినిపించదే జంటకి

Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Kamalakar
Lyrics powered by www.musixmatch.com

Link