Poovula Reakulila

పువ్వుల రేకులిలా అయ్యో రాలినవే
పక్షుల ఆశలిలా అయ్యో కూలినవే
తమ చోటే మారి బాటే మారి
ఊరే మారెనే ఊపిరి తీరే మారేనులే
జాబిల్లి జారుకుంటే
వెన్నెల ఉండదులే
కన్నోళ్లు దూరమైతే
కన్నీరాగదులే
మురిపాలే లేని
ప్రేమే లేని
బాల్యం ఉందిలే
ఎందరు ఉన్నా ఎందుకులే

పాడుకున్న పాటలన్నీ
మూగబోయి దాగినవే
ఆడుకున్న ఆటలన్నీ
సాగలేక ఆగినవే
తల్లి యాడ తండ్రి యాడ
తల్లడిల్లే ప్రాణమీడ
తమ రాతే మారి
గీతే మారి
బ్రతుకే మారెనే
మార్చిన ఘనతే ఎవ్వరిదో

పువ్వుల రేకులిలా అయ్యో రాలినవే
పక్షుల ఆశలిలా అయ్యో కూలినవే
తమ చోటే మారి బాటే మారి
ఊరే మారెనే
ఊపిరి తీరే మారేనులే
జాబిల్లి జారుకుంటే
వెన్నెల ఉండదులే
కన్నోళ్లు దూరమైతే
కన్నీరాగదులే
మురిపాలే లేని
ప్రేమే లేని
బాల్యం ఉందిలే
ఎందరు ఉన్నా ఎందుకులే

మురిపాలే లేని
ప్రేమే లేని
బాల్యం ఉందిలే
ఎందరు ఉన్నా ఎందుకులే



Credits
Writer(s): Chandrabose, Arrol Corelli
Lyrics powered by www.musixmatch.com

Link