Nee Needavutha

నీ నీడవుతా
నీ తోడవుతా
అడుగులో అడుగునై నీ నీడవుతా
నువ్వే నా ప్రాణం అన్నా
నీ నింగిలో రెండో జాబిలినై
నే నిలిచే వరమీవా, వరమీవా

ఆమెను మరపించకపొయినా
తలపించేలా నీ గుండెల్లో కాపురముంటా

కానీ చెలియా
కానీ చెలియా
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని నీకివ్వడానికి తడబాటు
కానీ చెలియా
కానీ చెలియా
ఆమెతొ చేసిన పయణాలు నీతో కావాలీ అలవాటు
నా నింగిలో ఒక తారగ వచ్చావులే
మెల మెల్లగా వెన్నెలై నిండావులే నా గుండెలో
నా నేలపై ఒక పువ్వై విచ్చావులే
మెల మెల్లగా తోటవై పూచావులే నా గుండెలో
చిరునవ్వై నువ్వొస్తే చిగురించా మళ్ళీ నేను
సిరిమువ్వై నా ఎదలో రవళించావే
వచ్చింది నాకోసమే ఇలా అమవాస లోన వెన్నెలా

కానీ చెలియా (కానీ చెలియా)
కానీ చెలియా (కానీ చెలియా)
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని నీకివ్వడానికి (నీకివ్వడానికి)

నేనిన్ను ప్రేమించు ముందే నీ ప్రేమంత నా చిట్టితల్లికి నువ్విచ్చావ్ ఇంకేమి
నే కోరకుండానే వరమిచ్చు దేవతల దిగినుండి దిగివస్తివే
ఒడిలో చేర్చీ
జోలాలి పాడీ
నువ్ సేద దీర్చగా నా గాయమారెలే

నీవే చెలియా (నీవే చెలియా)
నీవే చెలియా (నీవే చెలియా)
నీవే నా మౌనం నీవేనా గానం (నీవేనా గానం)
నీవే నా ధ్యానం
నీవే చెలియా (నీవే చెలియా)
నీవే చెలియా (చెలియా)
నీవే నా హృదయం నీవే నా ప్రయణం
నీవే నా లోకం



Credits
Writer(s): Vennelakanti Subbu Rajeswara Prasad, Yuvan Shankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link