Sutiga Choodaku

సూటిగా చూడకు
సూదిలా నవ్వకు

ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తియకూ
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు

నింగిలో మెరుపల్లె తాకినది నీ కల
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే మించే అందం అడుగేయగా
అంతా నీవల్లే నిమిషంలో మారిందంటా
బంతి పువ్వల్లే నా చూపే విచ్చిందంటా
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు

(సీతా కళ్యాణ వైభోగమే)
(రామ కళ్యాణ వైభోగమే)
(గౌరీ కళ్యాణ వైభోగమే)
(లక్ష్మీ కళ్యాణ వైభోగమే, వైభోగమే)
గంటలో మొదలైంది కాదు ఈ భావన
గతజన్మలో కదిలిందో ఏమో మన మధ్యన
ఉండుండి నా గుండెల్లో ఈ అదురేమిటో
ఇందాకిలా ఉందా మరి ఇపుడెందుకో
నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి
నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి
సూటిగా చూడకు
సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తియకూ
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు



Credits
Writer(s): Ananthasriram Chegondi, Arvindh Shankar
Lyrics powered by www.musixmatch.com

Link