Sogasu Choda Taramma

సొగసు చూడ తరమా
హా హా హా హా
సొగసు చూడ తరమా
హ హ హ హ
నీ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు ఎర్రన్ని కొపాలు ఎన్నెన్నో దీపాలు అందమే సుమా
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వెన్నకు బేజారుగ వంగినప్పుడు
చిరు కోపం చీర గట్టి సిగ్గును చెంగున దాచి ఫక్కుమన్న చక్కదనం పరుగో పరుగెట్టినప్పుడు
ఆ సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా

పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించి కొట్టి
గుమ్మెత్తే సోయగాల గుమ్మాలను దాటు వేళ
చెంగు పట్టి రా రమ్మని చలగాటకు దిగుతుంటే
తడి వారిన కన్నులతో విడు విడు మంటున్నప్పుడు
విడు విడు మంటున్నప్పుడు
ఆ సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా

జారుముడి ని జడకేసి జానకి లా అడుగేసి
తన అందేల నా గుండేల గల్లు జల్లుమంటే
నాసతి లా ఆరతి లా కల్యాణాపుఆరతి లా
శుక్రవారసందేవేళ సుదకి గుడికి వేళ్ళుతుంటే
ఆ సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
అ అ అ అ

పసిపాపకు పాలిస్తూ పరవశించి వున్నప్పుడూ
పెద పాపడు పాకివచ్చి మరి నాకో అన్నప్పుడు
మొట్టి కాయ వేసి
ఛీ పొండి
అన్నప్పుడు

నా ఏడుపూ
హహహ హహహ
నీ నవ్వులూ

హరివిల్లై వెలిసి నప్పుడు
ఆ సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా

సిరి మల్లెలు హరి నీలపు జడలో తురిమీ క్షణమే యుగమై వేచీ వేచీ
చలి పొంగులు తొలి కోకల ముడిలో అదిమీ మనసే సొలసీ కన్నులు వాచి
నిట్టూర్పులా నిశి రాత్రి తో నిదరోవు అందాలతో
త్యగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటీ
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా

సాహిత్యం: వేటూరి



Credits
Writer(s): Veturi Murthy, M Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link