Neelavarnam - From "Devaraagam"

నీలవర్ణ వేణులు నీల గిరుల్

నీ ముగ్ధ మోహన రూప కళల్
పాలను కడిగిన పరమ పదం
ఆ శ్రీ పదములే నాకు స్తుతుల్

సౌందర్య లహరి సౌభాగ్యవతి
గానాలుగ ఎగిసే కావేరివో
చందన శిల్పపు స్పందనలో
కిన్నెరసానికే భంగిమవో

శ్రీశైల శిఖరాన భ్రమరికవో
క్రిష్ణవో, శ్రీనాథ కల్పనవో
హృదయాన మన్మధ తలశాలు పొదిగిన గోదారి గౌతమివో
ఆ సప్త గిరులనే స్వరములుగా పలికించిన దేవి, శ్రీదేవివో
ధర్మార్ధ కామాల వాకిళ్ళలో ఎదురౌ మోక్షాల మాలక్ష్మివో

నీ తల వాకిట కైలాసం
నీ ఎద చాటున వైకుంఠం
నీ గర్భ గుడిలో బ్రహ్మ పదం
శ్రీ మహాలక్ష్మి నా దేవ సుందరి
నా దేవ సుందరి
నా దేవ సుందరి



Credits
Writer(s): M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link