Ayila Ayila

నా చేతిలో పువ్వల్లే నిలిచే
నును లేతగా నా ముళ్ళు విరిచే
నా ప్రియనేస్తం నువ్వే
నీ ముద్దుతో తెలవారుతుందే
నీ శబ్దమే నను మార్చుతుందే
నా గిలి గీతం నువ్వే
కురుల మూలమే తరచి చూడవా
పదును చూపుతో మదిని లాగవా
అధర కేశమే అపహరించవా మనసారా
నా రోమనై... రా

కొద్ది కొద్ది కొద్దిగా నన్నదిమి ఐల ఐల చేస్తావా
కొంటె చూపుతో కొల్లగొట్టి మిణుగురుకు వెల్ల వేస్తావా
మృదువుగా రుద్దుతావా ముత్యమౌ ఓయా
పువ్వేలేక ఐల తావి ఔతా
నువ్వొక చిరునవ్వే విసిరావే
పలు నెలవంకలు గల గల దూకగ నేల వెలిగేనే ఇలా
ఇక విద్యుత్ కోతలే రావడమే కల

మెల మెల్ల మెల్లగా నిలువెల్లా ఐల ఐలా పూస్తావా
ఆ కాంతి సోకి పలు కాకులిక కళ్ళు తేలవేస్తాయా
నీలి నింగిలో ఓయా లే మెరుపే ఓయా
రోజా పువులో ఐలా పసి ఎరుపే ఓయా
కలిసిన నవ వర్ణం నీ దేహం
నీ అణువణువున విరిసిన వెలుగులు పువ్వుల మేడలు కదా
ఇక తోటల్లోన విసిరినవి వాటికి నీడలు కదా

మేఘాలనే మగ్గాలు చేసి
నీలాలనే దారాలు తీసి నే ఓ వస్త్రం చేశా
ఆ వస్త్రమే నీపైన వేసి
అణ్వస్త్రమే అనిపింపజేసి నీ వున్మాదం చూశా
చిలిపి రాట్నమై వలపు వడకనా
వుడుకు నూలునై దరికి జరగనా
మరొక చర్మమై మెలిక తిరగనా
పోమాకే నా jean జింకా... రా



Credits
Writer(s): A R Rahman, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link