Jada Thoti Kodithey

జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓ రబ్బి కొట్టేయనా

కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకలే కొడుతుంటే నారాయణ
కన్నె చీరమ్మ బెణికింది నారాయణ
నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ
ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ
జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓ రబ్బి కొట్టేయనా

కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

ప్రేమించి పెళ్ళాడినా... ఓ ఓ పెళ్ళాడి ప్రేమించినా... ఓ ఓ
ముందుకొచ్చినా, పక్కకొచ్చినా, మీదికొచ్చినా నేనేగా
కొపమోచ్చినా, కోరికొచ్చినా, దారికొచ్చినా నేనేగా
చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ
ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా
చలి తలుపులకొక నిచ్చెన వేస్తావా ఇవ్వాళ
ఒడి దుడుకులకొక వంతెన కట్టాలా పూబాలా
నీ ఆటే కట్టినా, నిన్నే ఆకట్టినా
ఆ తాళి కట్టేది నాకే కదా
కొత్త కౌగిళ్ళు కడుతుంటే నారాయణ
కొంగు గొంగళ్ళు పరిచింది నారాయణ
సోకు పెద్దిల్లు కడతుంటే నారాయణ
సిగ్గు చిన్నిల్లు కూలింది నారాయణ

చాపేసి దిండేసినా... ఓ ఓ దిండేసి చాపేసినా... ఓ ఓ
సేవ చేసినా, దాడి చేసినా, గొడవ చేసినా నేనేగా
తప్పు చేసినా, ఒప్పు చేసినా, చెప్పి చేసినా నేనేగా
గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల
మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా
హోయ్ గిలిగిలి గిలిగింతలు కావాలా గోపాల
మరుమరు మరుమల్లెలు పెట్టాలా ప్రియురాలా
మోమాటం పెట్టినా, ఇరకాటం పెట్టినా
అడిగింది పెట్టేది నేనే కదా
సుముహుర్తాలు పెడుతుంటే నారాయణ
సన్న నడువమ్మ నవ్వింది నారాయణ
పాలు పళ్ళన్నీ పెడుతుంటే నారాయణ
పట్టు పరుపమ్మ ఏడ్చింది నారాయణ
జడ తోటి కొడితే జగ్గల్ పేట్లో పడతావ్ ఓ రబ్బి కొట్టేయనా

కుడి కన్ను కొడితే కాకినాడ్లో పడతావ్ ఓలమ్మి కొట్టేయనా

నువ్వు నన్ను కొట్టినా, నే నిన్ను కొట్టినా
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకలే కొడుతుంటే నారాయణ
కన్నె చీరమ్మ బెణికింది నారాయణ
నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ
ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ



Credits
Writer(s): Chandrabose, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link