Nannu Lalinchu - Solo Version

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేక నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

నదిలాగ నీవు కదలాడుతుంటే
నీతోపాటు సాగే తీరంనేనవ్వనా
నిశిరాత్రి నీవు నెలవంక నేను
నీతో పాటు నిలచే కాలం చాలందునా
మొక్కై ఎదురొచ్చి వనముగ మారావు
కలలే నాకిచ్చి కనులను దోచావు
యదలయలోన లయవయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వు

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

భువిలోన గాలి కరువైన వేళ
నా ప్రాణాన్ని నీ వూపిరిగా మార్చేయనా
నీలాల నింగి తెలవారకుంటే
నా జీవాన్నే నీకో దివ్వెగ అందించనా
శిలలా మౌనంగ కదలక పడివున్నా
అలలా నువు రాగా అలజడినౌతున్న
దీపం నువ్వైతే నీ వెలుగు నేనవ్వనా
నీలో సగమవ్వనా

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆనింగి ఈ నేల నిప్పేనువ్వా లేక నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా



Credits
Writer(s): S.a. Rajkumar, Shiva Ganesh
Lyrics powered by www.musixmatch.com

Link