Mansu Kannu

మనసు కన్ను చేసుకొని చూడరా లోకం
ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం

మనసు కన్ను చేసుకొని చూడరా లోకం
ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం
మనసు కన్ను చేసుకొని చూడరా లోకం
మనసనేది దీపం అది మనిషికి రూపం
నీడే తోడు లేకుండా లేదురా దీపం

మనసు కన్ను చేసుకొని చూడరా లోకం

అదిగో అతడే దక్షుడు
శివద్వేష దీక్షా దక్షుడు

ఏమి చూసి వలచావు శివుడ్ని
ఎందుకు వరించావు వల్లకాటి విభుడిని
గంగవెర్రి గంతులవాడు
చందమామ చిందులవాడు
ఎగుడు దిగుడు కన్నులతోనే రగిలి పోయి రసికుడువాడు

ఏమి చూసి వలచావు శివుడ్ని
ఎందుకు వరించావు వల్లకాటి విభుడిని

గరణం కంఠాణ దాచి ధరణి బ్రోచినవాడు
సరసం దేవతలకిచ్చి, సన్యాయసిగా మారినాడు
త్యాగం ఆతని యోగం
అనురాగ౦ ఆతని యోగం
తనువు కాదు కనులు కాదు మనసు కన్నుగా మలచి
మహాశివుని వరించా
మనువాడి తరిస్తా

(గౌరమ్మ పృదయ కళ్యాణ వీణ మీటింది శివుని రూపం
మనసున్న చోట గుణమల్లె దోచుకొని ఉన్నవాడి లోకం
శ్రీరస్తు ప్రేమకి
శ్రీగౌరి పెళ్లికి
ఆది దంపతుల ప్రేమయే పలికే నాంది ఈ సృష్టికి
గౌరియే శివుడు ఆది మానవుడు ప్రాణులా దృష్టికి)

పరవళ్లతో వచ్చే పరుగెత్తి గంగా
నింగి నేలను ఏక ధారగా పొంగా
శివుడు చూసిన గంగా శివమెత్తి పోయే
భవుడు చూసిన గంగా పడగిత్తి దూకే
తన జఠాజూటాలు విసిరినప్పుడు శివుడు
(ఓం)

పట్టుబడిపోయింది పడతి గంగమ్మ
పగబట్టి చూసింది రగిలి గౌరమ్మ
సవతులు ఇద్దరి మధ్య సరసుగా శివుడు
సగభాగం ఇచ్చాడు సతికి తన తనువు
సాంభ శివుడైపోయె ఆ సదా శివుడు
అర్ధనారీశ్వరుడు ఆయే ఆ దేవుడు

(ఓం
ఓం
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ)

ఒకరినొకరు తెలుసుకొని
ఒకరికొకరు మనసు అని
తెలుసుకున్న సతీ పతులు శివపార్వతులు
తెలివి కలిగి మసలుకోండి మీ దంపతులు



Credits
Writer(s): Veturi, Agastya
Lyrics powered by www.musixmatch.com

Link