Thalambraalatho

తలంబ్రాలతో దోసిళ్ళు తనువందాల దోపిళ్ళు
కందిన అందపు కావిళ్ళు కన్నె బుగ్గలో క్రావళ్ళు
దూసిళ్లెత్తిన చేతుల చాటున దోచాక తప్పని దొరసొగసులు
దోపిడీ చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేత సిగ్గులు

కనువ వచ్చే చేయి కలువ పూమొక్క
కలుపు కున్న వేళ్ళు చంద్ర కిరణాలు
కలవరించే కన్ను కమల పూరేకు
కన్ను కలిపే చూపు సూర్య కిరణాలు

(సఖా సప్తపద భవ, సాఖాయౌ సప్తపద బభూవ
సఖ్యంతే గమేయం, సఖ్యతే మాయోషం, సఖ్యన్మే మాయోష్ఠ
సమాయావా సంకల్పావహై సంప్రియౌ రోజిష్ణు సుమనస్యామనోవ్)

పుట్టింటి పూబంతి పుణ్యాల రాసి
అత్తింటి కెల్లేటి ఆ ఘడియలోన
అప్పగింతలు వేళ ఉప్పొంగి వచ్చే
కన్నవారి ప్రేమ కన్నీటి గంగ
కట్టుకున్న ప్రేమ కడలిని కడలి
ఆ కడలిలో గంగ కలిసేటి వేళా
మమతలన్నీ కలిసి మౌన రాగాలు
శ్రీ నాథ కవి రాజు కావ్యామృతాలు

(సిరి నీవే రావమ్మా చిగురాకు రెమ్మ
హరి లాంటి అబ్బాయే దొరికాడులేమ్మా
పుట్టింటి వారింటి పుణ్యాల కొమ్మ
అత్తింట కుడికాలు పెట్టి రావమ్మా)



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Mani Sarma
Lyrics powered by www.musixmatch.com

Link