Yedho

ఏదో అలజడే నను పిలిచే
కళ్లే దాటి కలలే నడిచే
చుట్టూ అంతా నాటకమైతే
నటన రాక నే వెళ్ళిపోతే
కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగి పోయనా
పొద్దే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా
పిల్ల నీ తలపులతో ఎదకి ప్రాణం పోసానే
నీకే దూరం అవుతున్నా ఎదని వదిలి వెళుతున్నా

నన్నే నువ్వుగా మార్చా నేనిక ఏమి కాక మిగిలానిల
ఎటూ వెళ్ళక ఏమి తోచక ఉన్న వేచి నువ్వు లేక ఎల
నీ రాక జీవితంలో నా పగలు రేయిని మరిపించిందిలే
నువ్వు వెంట లేకపోతే నా చావుకు బతుకుకు తేడా లేదులే
మంటే రేపు తడి జ్వాలలకి కన్నీళ్ళరవే ఓ చెలియా
నువ్వే జ్ఞాపకం అయ్యవీ ఈ క్షణం అంతేనా
పిల్ల నీ తలపులతో ఎదకి ప్రాణం పోసానే
నీకే దూరం అవుతున్నా ఎదని వదిలి వెళుతున్నా

ఏదో అలజడే నను పిలిచే కళ్లే దాటి కలలే నడిచే
చుట్టూ అంతా నాటకమైతే నటన రాక నే వెళ్ళిపోతే
కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగి పోయనా
పొద్దే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా
పిల్ల నీ తలపులతో ఎదకి ప్రాణం పోసానే
నీకే దూరం అవుతున్నా ఎదని వదిలి వెళుతున్నా



Credits
Writer(s): Vennelakanti, Yuvanshankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link