Chandamama

చందమామ కోసమే వేచి ఉన్న రేయిలా
వేయి కల్లతోటి ఎదురు చూడనా
వాన జల్లు కోసమే వేచి ఉన్న పైరులా
గంపెడంత ఆశతోటి చూడనా

జోల పాట కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగ
కోడి కూత కోసం తెల్లరు జాము పల్లెటూరిలాగ
ఆగనే లేనుగ చెప్పవా నేరుగా
గుండెలో ఉన్న మాట
ఏయ్ ఒకటి అ రెండు అ మూడు అంటు
మరి ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా
వేళ్ళు వేళ్ళు వేళ్ళు అంటు ఈ కాలన్ని ముందుకే నేను తొయ్యనా

తొందరే ఉందిగా ఊహకైన అందనంతగా
కాలమా వెళ్ళవే తబేలులాగ ఇంత నెమ్మదా
నీతో ఉంటుంతె నిన్నే చూస్తుంటె
రెప్పే వేయకుండ చేప పిల్లలా
కళ్ళెం వేయలేని ఆపే వీల్లేని
కాలం వెళ్తోంది జింక పిల్లలా
అడిగితే చెప్పవు అలిగినా చెప్పవు కుదురుగా ఉండనీవూ

ఏయ్ ఒకటి అ రెండు అ మూడు అంటు
మరి ఒక్కో క్షనాన్ని నేను లెక్క పెట్టనా
మూడ్ అ రెండు అ ఒకటి అంటూ
గడియారన్ని వెనక్కి నేను తిప్పనా

ఎందుకో ఏమిటొ నిన్న మొన్న లేని యాతనా
నా మదే ఆగదే నేను ఎంత బుజ్జగించినా
చీపో అంటావో నాతో ఉంటావో
ఇంకేం అంటావొ తెల్లవారితే
విసుక్కుంటావో అతుక్కుంటావో ఎలా ఉంటావో లేఖ అందితే
ఇంక ఊరించు ఇంత వేదించకు
నన్నిలా చంపమాకూ

ఏయ్ ఒకటి అ రెండు అ మూడు అంటు
మరి ఒక్కో క్షనాన్ని నేను లెక్క పెట్టనా
మూడ్ అ రెండు అ ఒకటి అంటూ
గడియారన్ని వెనక్కి నేను తిప్పనా



Credits
Writer(s): Devi Sri Prasad, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link