Dolu Baja Sannayi

పందిరి చేరెనమ్మా
పచ్చని పూలకొమ్మా
దీవించమ్మ ప్రేమా
ప్రియతమా సుఖీభవ

డోలుబాజా సన్నాయి మోగుతామంటున్నాయి
(ढोले अरे बाजो
अरे ढोले ये बाजोरे)
గౌరిపూజ కానియ్యి పెళ్ళిచేస్తామన్నాయి
(ढोले अरे बाजो
अरे ढोले ये बाजोरे)
రాముడే నీ వరుడయ్యి ప్రేమతో నీ వరసయ్యి
వరమల్లె నిను చేరగా
మెల్లగా నవ వధువయ్యి వెళ్ళవే నువ్వెదురయ్యి
వరమాలగా వాలగా

(కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం
కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం)

డోలుబాజా సన్నాయి మోగుతామంటున్నాయి
గౌరిపూజ కానియ్యి పెళ్ళిచేస్తామన్నాయి

ఏమినోము నోచావమ్మా కుందనాల కూనమ్మా
నీకు సొంతమయ్యిందమ్మా నమ్ముకున్న నీప్రేమ
రాసిపెట్టి ఉంచాడమ్మా ముందుగానే ఆ బ్రహ్మ
జంటగానె పుడుతుందమ్మా పొందుతున్న ప్రతిజన్మ
త్రేతాయుగం నాటి సీతమ్మ మనువంట ఈ తంతు మాకోసమే
ఏటేటా జరిగేటి శ్రీరామ నవమంట ఈ పెళ్ళి అపురూపమే

(కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం)

డోలుబాజా సన్నాయి మోగుతామంటున్నాయి
(ढोले अरे बाजो
अरे ढोले ये बाजोरे)
గౌరిపూజ కానియ్యి పెళ్ళిచేస్తామన్నాయి
(ढोले अरे बाजो
अरे ढोले ये बाजोरे)
రాముడే నీ వరుడయ్యి ప్రేమతో నీ వరసయ్యి
వరమల్లె నిను చేరగా
మెల్లగా నవ వధువయ్యి వెళ్ళవే నువ్వెదురయ్యి
వరమాలగా వాలగా

పాలకడలి కూతురువంట కాలుపెడితె చాలంట
కట్టుకున్న ప్రతి నట్టింటా అష్టసిరుల కొలువంట
శాశ్వతంగ ఇక నీ ఇంట ఛైత్రమాసమేనంట
సంబరంగ ఇక ప్రతిపూటా సంకురాత్రి పండగట
కనవమ్మ కళ్యాణి ఈనాటి కళలన్ని శ్రీవారి కనుపాపలో
వినవమ్మ అలివేణి ఈవేదమంత్రాన్ని నూరేళ్ళ కౌగిళ్ళలో

(కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం)

డోలుబాజా సన్నాయి మోగుతామంటున్నాయి
(ढोले अरे बाजो
अरे ढोले ये बाजोरे)
గౌరిపూజ కానియ్యి పెళ్ళిచేస్తామన్నాయి
(ढोले अरे बाजो
अरे ढोले ये बाजोरे)
రాముడే నీ వరుడయ్యి ప్రేమతో నీ వరసయ్యి
వరమల్లె నిను చేరగా
మెల్లగా నవ వధువయ్యి వెళ్ళవే నువ్వెదురయ్యి
వరమాలగా వాలగా

(కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం)



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link