O Maria

ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
ప్రతీరోజు విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు

ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
ప్రతీరోజు విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు
సిరిమువ్వ రేపంటూ వెనుదీస్తుందా
ఘల్ ఘల్ ఘల్ మోగించగా
సిరిమల్లె మాకంటూ ముసుగేస్తుందా
ఘుం ఘుం ఘుం పంచివ్వగా
ప్రతీదినం ప్రభాతమై
వరాలు తెచ్చే సూర్యుడు
ప్రకాశమే తగ్గించునా నావల్ల కాదంటూ
ప్రతీక్షణం హుషారుగా
శ్రమించి సాగే వాగులు
ప్రయాణమే చాలించునా మాకింక సెలవంటూ
హే ఉల్లాసంగ ఉత్సహంగ బ్రతుకే సాగని
అంతేలేని సంతోషాలు ఒళ్లోవాలని
ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
హే రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
చిరుగాలి చిత్రంగ రానంటుందా
ఝం ఝం ఝం పయనించగా
కొమ్మల్లో కోకిల్ల కాదంటుందా
కు కు కు వినిపించగా
నిరంతరం దినం దినం
అలాగే సహనం చూపుతూ
విరామమే లేకుండగా
ఈ నేల తిరుగునుగా
ఆకాశమే అందాలని
చిన్నారి రెక్కల గువ్వలు
అనుక్షణం అదే పనై ఆరాట పడిపోవా
హే మనసే ఉంటే
మార్గం తానే ఎదురొస్తుందిలే
సత్తా ఉంటే స్వర్గం కూడా
దిగి వస్తుందిలే
ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
హే రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
ప్రతీరోజు విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు



Credits
Writer(s): Karl Cameron Porter, Luis Gomez Escolar Roldan, Robert Edward Rosa
Lyrics powered by www.musixmatch.com

Link