Yekommakakomma

ఏ కొమ్మకాకొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా
ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా
నీ పాదాలకే మువ్వలా
ఒక దేవత దివి దిగి వచ్చె ప్రియనేస్తం లాగా
ఎద గూటికి అతిథిగ వచ్చె అనుబంధం కాగా
మనసాయె మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం
ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా

ఆకాశ దేశాన దీపాలు స్నేహాల చిరునవ్వులు
నా నావ కోరేటి తీరాలు స్వర్గాల పొలిమేరలు
మమతల మధు మధురిమలిటు సరిగమలాయే
కలబడు మన మనసుల కలవరమైపోయే
గాలుల్లో అందాలు పూలల్లో అందాలు జత చేయు హస్తాక్షరి
అభిమానాల అంత్యాక్షరి
ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా

ఎన్నాళ్ళు ఈ మూగభావాలు సెలయేటి తెరచాపలు
నాలోని ఈ మౌనగీతాలు నెమలమ్మ కనుపాపలు
కుడి ఎడమల కుదిరిన కల ఎదకెదుటాయే
ఉలి తగిన శిల మనసున సొద మొదలాయే
ఈ సప్తవర్ణాల నా సప్తరాగాల పాటల్లో ప్రథమాక్షరి
ఇది ప్రాణాల పంచాక్షరి
ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా
ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా
నీ పాదాలకే మువ్వలా
ఒక దేవత దివి దిగి వచ్చె ప్రియనేస్తం లాగా
ఎద గూటికి అతిథిగ వచ్చె అనుబంధం కాగా
మనసాయె మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం



Credits
Writer(s): Veturi, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link