Pari Poke Pitta

హేయ్ పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా
హేయ్ పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా
అంత మారం ఏంటంటా మాట వినకుండా
సరదాగా అడిగాక మజిలీ చేర్చవా
తీసుకుపో నీ వెంటా
వస్తా తీసుకుపో నీ వెంటా

నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
భద్రంగానే ఉందా ఏ బెంగ పడకుండా
తన అందెలుగా తొడిగా నా చిందవందర సరదా
ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా
హొయ్ చినబోయిందేమో చెలి కొమ్మా
ఆ గుండెల గూటికి
ముందే కబురియ్యవే చిలకమ్మా
నీ వాడు వస్తాడే ప్రేమా
అని త్వరగా వెళ్లి
నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా
తీసుకుపో నీ వెంటా
వస్తా తీసుకుపో నీ వెంటా

హే పుటుక్కు జర జర డుబుక్కుమే
పుటుక్కు జర జర డుబుక్కుమే

ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది
అన్నం పెట్టను పోవే అని కసిరేసావంది
నిద్దుర ఎదురైంది తెగ చిరాగ్గా ఉన్నట్టుంది
తన వద్దకు రావద్దంటూ తరిమేసావంటుంది
హోయ్ ఏం గారం చేస్తావే ప్రేమా
నువ్వడిగిందివ్వని వాళ్ళంటూ ఎవరున్నరమ్మా
ఆ సంగతి నీకూ తెలుసమ్మా
నీ పంతం ముందు
ఏనాడూ ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
తీసుకుపో నీ వెంటా
ఓ ప్రేమ తీసుకుపో నీ వెంటా

తీసుకుపో నీ వెంట
అరె తీసుకుపో నీ వెంటా
తీసుకుపో నీ వెంటా
హొయ్ హొయ్ హొయ్ హోయ్



Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link