Oososi Poolateega

ఓసోసి పూల తీగా ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కలలోకె వస్తాగా
నీ కోసమే నీ కోసమే ఇన్నాళ్ళు వేచున్నా
నీ శ్వాసని నా గుండెల్లో దాచేసుకుంటున్నా
ఓసోసి పూల తీగా ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కలలోకె వస్తాగా

ఉయ్యాలూగే వయ్యారాన్ని మదించిన ఈ వేళ
సదా సదా నిన్నే చేరి సుఖించిన ప్రియురాల
నయాగరా జలపాతంలో చుట్టేసుకో చెలికాడా
శృంగారపు లోతెంతుందో చూసే సుకో నావికుడా
తెరచాటు యవ్వనపు దగ దగలు
కొనగొటు గిటు పడు సరిగమలు
తెరచాటు యవ్వనపు దగ దగలు
కొనగొటు గిటు పడు సరిగమలు
నడుమే నాగుపామై ఊగనీ
ప్రియుడా కన్నె సిగ్గే తొలగనీ
ఓసోసి పూల తీగా ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కలలోకె వస్తాగా
నీ కోసమే నీ కోసమే ఇన్నాళ్ళు వేచున్నా

నీ శ్వాసని నా గుండెల్లో దాచేసుకుంటున్నా

పెదాలలో తీయని తేనే ఊరిందిలే నీ కోసం
ప్రియా ప్రియా తుమ్మెదలాగా జూరేసుకో సర్వస్వం
హటాత్తుగా చలి పెనవేసే హిమాలయపు అంచులో
నరాలతో చలిమంటేసి తరించిన జవరాల
మృదువైన ముద్దులతో మురిపించు
అరుదైన కానుకలు అందించు
మృదువైన ముద్దులతో మురిపించు
అరుదైన కానుకలు అందించు
వయసే వాన చినుకై తడమనీ
వలపే వరద పొంగై పొరలనీ
ఓసోసి పూల తీగా ఆడుకుందమా సరదాగా
కాదంటే కందిరీగా నీ కలలోకె వస్తాగా
నీ కోసమే నీ కోసమే ఇన్నాళ్ళు వేచున్నా
నీ శ్వాసని నా గుండెల్లో దాచేసుకుంటున్నా



Credits
Writer(s): Bhuvana Chandra, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link