Siggu Thochi

సిగ్గుతో చీ చీ, చీరతో పేచీ,
ఆపినా ఆగునా ప్రేమ పిచ్చి...
వద్దకే వచ్చి, బుగ్గలే గిచ్చి,
ఆపదే తీర్చనా ముద్దులిచ్చి...
కన్నులే కాచి, వెన్నెలే వేచి,
నిన్నిలా చూసి, నన్ను ఇచ్చేసి,
లాలించి చూపించు నీలో రుచి...
సిగ్గుతో చీ చీ, చీరతో పేచీ,
ఆపినా ఆగునా ప్రేమ పిచ్చి...

పూవై పూచి తేనే దాచి వచ్చా నేరుగా...
ఆచి తూచి నిన్నే కాచి నాదంటానుగా...
నిన్నే మెచ్చి చేయ్యే చాచి అందించానుగా...
నువ్వే నచ్చి అన్నీ మెచ్చి ఉన్నానింతగా...
నిదురే కాచి, నిను గెలిచి,
నిదురే లేచి, ఎద తెరిచి,
ప్రేమించే దారి చూపించి...
సిగ్గుతో చీ చీ, చీరతో పేచీ,
ఆపినా ఆగునా ప్రేమ పిచ్చి...

ఈడే వచ్చి పెంచే పిచ్చి మోసా జాలిగా...
నువ్వే నాకు తోడై తోచి నన్నే పంచగా...
ఆలోచించి ఆలోచించి చేరా సూటిగా...
ఒళ్లోకొచ్చి వడ్డించాలి నిన్నే విందుగా...
మనసందించా మైమరచి...
మనసా వాచా నిను వలచి...
కవ్వించే కానుకందించి...
సిగ్గుతో చీ చీ, చీరతో పేచీ,
ఆపినా ఆగునా ప్రేమ పిచ్చి...
వద్దకే వచ్చి, బుగ్గలే గిచ్చి,
ఆపదే తీర్చనా ముద్దులిచ్చి...
కన్నులే కాచి, వెన్నెలే వేచి,
నిన్నిలా చూసి, నన్ను ఇచ్చేసి,
లాలించి చూపించు నీలో రుచి...



Credits
Writer(s): Mani Sharma, Peddada Murthy
Lyrics powered by www.musixmatch.com

Link