Andamaina Lokam

Hey Girl Hey Girl Wanna Say Something
Will You Listen to Me Now

Hey Boy Hey Boy I Wanna Be A Thing
Tell Me All That You Wanna Say Now

అందమైన లోకం, అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం

అందమైన భావం, అందులో నువు మొదటి అక్షరం
అందుకేగ నీతో సాగుతోంది చిన్ని పాదం

ఓ చెలి అనార్కలి, నీ నవ్వులే దీపావళి
పేరుకే నేనున్నది, నా ఊపిరే నువ్వేమరి
చందమామనెవ్వరైన పట్టపగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా
అందమైన లోకం, అందులోన నువ్వు అద్భుతం

అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం
Hey Girl Hey Girl Wanna Say Something

Will You Listen to Me Now
Hey Boy Hey Boy I Wanna Be A Thing
Tell Me All That You Wanna Say Now

ఓర చూపుకే లొంగిపోవడం
దోర నవ్వుకే పొంగిపోవడం
ప్రేమలోనే నేర్చుకున్నా రాతిరంతా మేలుకోవడం
నిన్ను నాలో దాచుకోవడం
నన్ను నీలో చూసుకోవడం
నమ్మలేక నన్ను నేనే అప్పుడప్పుడూ గిల్లుకోవడం

ఓ చెలి అనార్కలి, బాగున్నదీ హడావిడి
నేనిలా వినాలనే ఇన్నాళ్లనుంచి కలలు కన్నది...

అందమైన లోకం, అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం

పూటపూటకు పండగవ్వడం
మాటిమాటికి నవ్వుకోవడం
ప్రేమలోన తేలుతుంటే కష్టమేలే తట్టుకోవడం
దిండునేమో హత్తుకోవడం
జుట్టు రింగులు తిప్పుకోవడం
ప్రేమపిచ్చే రేగుతుంటే తప్పదేమో దారితప్పడం
ఓ చెలి అనార్కలి, తమాషగుందిలే ఇది
అందుకే సరాసరీ మనస్సు ఇచ్చిపుచ్చుకున్నది...
అందమైన లోకం, అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం
Hey Girl Hey Girl Wanna Say Something
Will You Listen to Me Now
Hey Boy Hey Boy I Wanna Be A Thing
Tell Me All That You Wanna Say Now



Credits
Writer(s): Devi Sri Prasad, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link