Eppatikappudu

ఎప్పటికప్పుడు ఎదురై నన్ను తిప్పలు పెట్టావు
గుప్పెడు గుండెను తడిమే ఒక ఉప్పెన రేపావు
ఏంటో మరి ఈ ఆవిరి ఓ సారిలా నువ్వు చూస్తే సరి
తుంటరి మనసుల జంటవు నువ్వే ఎవరు ఏమన్నా
రెక్కలు కట్టు రివ్వున ఎగిరే గవ్వలమవుదామ

ఎప్పటికప్పుడు ఎదురై నన్ను తిప్పలు పెట్టావు
గుప్పెడు గుండెను తడిమే ఒక ఉప్పెన రేపావు

నమ్మలేకపోతున్నా పిచ్చివాడినె అవుతున్నా
నిన్న లాగా మొన్న లాగా ఉండలేక పోతున్నా
నాకు నేనే గుర్తు రానే ఎంతసేపైనా
రెప్పలు మూయగ చప్పున వచ్చే స్వప్నం నువేగా
ప్రేమలో పడితే తప్పని సరిగా జరిగేదంతేకదా

ఎప్పటికప్పుడు ఎదురై నన్ను తిప్పలు పెట్టావు
గుప్పెడు గుండెను తడిమే ఒక ఉప్పెన రేపావు

పక్కనేదో అవుతున్నా పట్టనట్టే ఉంటున్నా
ఊహలోన మునిగిపోయి తేల లేక చస్తున్నా
నువ్వు లేక నేను లేను ఆరు నూరైనా
ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ఏమిటి హైరానా
నీలాగే నాకు ఉంది నిజమే చెబుతున్నా

ఎప్పటికప్పుడు ఎదురై నన్ను తిప్పలు పెట్టావు
గుప్పెడు గుండెను తడిమే ఒక ఉప్పెన రేపావు
ఏంటో మరి ఈ ఆవిరి ఓ సారిలా నువ్వు చూస్తే సరి
తుంటరి మనసుల జంటవు నువ్వే ఎవరు ఏమన్నా
రెక్కలు కట్టు రివ్వున ఎగిరే గవ్వలమవుదామ

ఎప్పటికప్పుడు ఎదురై నన్ను తిప్పలు పెట్టావు
గుప్పెడు గుండెను తడిమే ఒక ఉప్పెన రేపావు



Credits
Writer(s): Chakri, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link