Laali Paaduthunnadi

హాయి
హాయి

లాలి పాడుతున్నది ఈ గాలి
ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి
లాలి పాడుచున్నది ఈ గాలి
ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి

(ఏలో యాలా ఏలో యాలా హైలెస్సో)
హైల పట్టు
(హైలెస్సా)
బల్లాకట్టు
(హైలెస్సా)
అద్దిర బాబు
(హైలెస్సా)
అక్కడ పట్టు
(హైలెస్సా)
సన్నాజాజి
చీరకట్టి
సిన్నాదొచ్చి
(హైలెస్సా)
కన్నూగొట్టే
(హైలెస్సా)
తన్నానన్న తన్నన తన్నానన్నా హైలెస్సా

గాలి కొసల లాలి ఆ పూల తీవెకు
వేలి కొసల లాలి ఈ బోసి నవ్వుకు
బుడి బుడి నడకలకు భూమాత లాలి
ముద్దు ముద్దు పలుకులకు చిలకమ్మ లాలి
ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మ లాలి
చెంగు చెంగు గంతులకు చందమామలు దాగివున్న కుందేలమ్మ లాలి
నా లాలి నీకు పూలపల్లకి
అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి

ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
(గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ)
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
(గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ)

గుమ్మాడి సెటు మీద
(ఆట చిలకల్లారా)
పాట చిలకల్లారా
(కలికి చిలకల్లారా)
కందుమ్మ గడ్డలు
(కలవారి మేడలు)
ముత్యప్పు గొడుగులు
(మురిపాల మురుగులు)
రంగు రుద్రాక్షలు
(తీరు గోరెంటలు)
తీరు రుద్రాక్షలు
(పరుగుల కట్టలు
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ)

వెన్నముద్ద లాలి చిన్నారి మేనికి
గోరుముద్ద లాలి బంగారు బొమ్మకి
ఓనమాలు పలికితే పలకమ్మ లాలి
బాలశిక్ష చదివితే పలుకులమ్మ లాలి
దినదినము ఎదుగుతుంటే దినకరుని లాలి
పదుగురొచ్చి నిను మెచ్చితే కన్నులారా చూసే తల్లికి కడుపు తీపి లాలి

నా లాలి నీకు పూలపల్లకి
అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి
హాయి
హాయి

లాలి పాడుతున్నది ఈ గాలి
ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి



Credits
Writer(s): M.m. Keeravani, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link