Ye Janma Bandhamo

ఏ జన్మ బంధమో ఈ స్నేహం
ఏ దివ్య రూపమో నేస్తం
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం
ఇన్నాళ్ళ కొచ్చెనా సాయం
నేనున్నా అంది నీచూపే
నేనున్న ధ్యాస నీవైపే
అవునన్నా ఎవరు కాదన్నా నువ్వేనా ప్రాణం ప్రాణం

ఏ జన్మ బంధమో ఈ స్నేహం
ఏ దివ్య రూపమో నేస్తం
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం
ఇన్నాళ్లకొచ్చేనా సాయం

ఎంతెంత దూరం ఆనంద తీరం అనుకుంటూ తిరిగా ఇన్నాళ్ళు
గోరంత స్నేహం కొండంత తోడై కనిపించగానే కన్నీళ్లు
గుండెల్లో భారాలు మాయమే
నీరెండల్లో సెలయేటి స్నానమే
నిను కోరితే నీ ఒడి చేరితే మనసెగిరింది మేఘాల దారుల్లో

అపురూపమైన బంగారు నువ్వు అనుకోని కలవై కలిశావు
క్షణ కాలమైన విడలేను నిన్ను, కను రెప్పలోనే ఉంటావు
స్నేహాన్ని దాటాను ప్రేమతో
ఈ దేహాన్ని వదలాలి ప్రేమలో
నీ నీడగా నీ చెలికాడుగా ప్రేమిస్తాను నీకన్న నిన్నెంతో

నేనున్నా అంది నీచూపే
నేనున్న ధ్యాస నీవైపే
అవునన్నా ఎవరు కాదన్నా నువ్వేనా ప్రాణం ప్రాణం
ఏ జన్మ బంధమో ఈ స్నేహం
ఏ దివ్య రూపమో నేస్తం
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం
ఇన్నాళ్ళకొచ్చెనా సాయం



Credits
Writer(s): Yuvan Shankar Raja, Laksmi Bhjoopal
Lyrics powered by www.musixmatch.com

Link