Vaana Chinukulu

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే

అగవమ్మో అమ్మో ఎంత దురుసే అరే అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్లేలు వేసి ఇక అల్లడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే

నీ వలన తడిశా నీ వలన చలిలో చిందేశా
ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశా
జారు పవిటను గొడుగుగా చేసేనోయ్
అరే ఊపిరితో చలి కాసానోయ్
హే... ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే

వాన చినుకులు
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే

సిగ్గులతో మెరిశా గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగా కురిసా ఒళ్లు హరివిల్లుగా వంచేశా
నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిరుగులు తొడిగాయో
నువ్వు కుండపోత లాగా వస్తే బిందె లాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ అగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే అరే అబ్బాయంటే అంత అసులే
నీకు కళ్లేలు వేసి ఇక అల్లడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే

సాహిత్యం: అనంత శ్రీరాం

Credits
Writer(s): Ananth Sriram, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com

Link