Priya

ప్రియా ప్రియా చంపోద్దే
నవ్వీ నన్నే ముంచోద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వన్నెలతో ప్రాణం తీయోద్దే

ప్రియా ప్రియా చంపోద్దే
నవ్వీ నన్నే ముంచోద్దే

చెలియా నీదు నడుమును చూశా అరెరే బ్రహ్మెంత పిసనారి
తలపైకెత్తా కళ్ళు తిరిగిపోయే ఆహా అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచెగ మలచి రవివర్మ గీసిన వదనమట
నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమటా
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమటా

ప్రియా ప్రియా చంపోద్దే
నవ్వీ నన్నే ముంచోద్దే

(అందమైన పువ్వా పువ్వా చెలి కురుల సురభి తెలిపేవా
అందమైన నదివే నదివే చెలి మేని సొగసు తెలిపేవా
అందమైన గొలుసా గొలుసా కాలి సొగసు తెలిపేవా
అందమైన మణివే మణివే గుండె గుబులు తెలిపేవా)

చంద్రగోళంలో oxygen నింపి అక్కడ నీకొక ఇల్లుకడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి నిను జో కొడతా
నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా
పంచవన్నె చిలక జలకాలాడగ మంచుబిందువులె సేకరిస్తా
దేవత జలకాలాడిన జలమును గంగా జలముగ సేవిస్తా
ప్రియా ప్రియా చంపోద్దే

ప్రియా ప్రియా చంపోద్దే
నవ్వీ నన్నే ముంచోద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వన్నెలతో ప్రాణం తీయోద్దే
ప్రియా ప్రియా చంపోద్దే
నవ్వీ నన్నే ముంచోద్దే



Credits
Writer(s): Tahar Mourad Jaballah
Lyrics powered by www.musixmatch.com

Link