Sayamkalam - From "Challenge"

సాయంకాలం
సాగర తీరం
నా చెలి వొళ్ళో
చలి సందళ్ళో
రోజూ మోజుగా జల్సా చేయరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా

సాయంకాలం
సాగర తీరం
వెచ్చని వొళ్ళో
వెన్నెల గుళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
నడి రాతిరల్లే పగటిపూట రాసలీలలాడరా

కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా
కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా
కవ్వించి నవ్వించి కసితీరా కరిగించి కథకాస్త నడిపించనా
మరుమల్లె మరి విచ్చుకునే వేళ
కళ్ళుమరీ గిచ్చుకునే వేళ
మరుమల్లె మరి విచ్చుకునే వేళ
కళ్ళుమరీ గిచ్చుకునే వేళ
రానంటానా పొదరింటికి పూతకొచ్చి
పండుతున్న పులకరింత వేళకి
హ సాయంకాలం
సాగర తీరం

సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందే లేదంటానా
సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందే లేదంటానా
రేపంటూ మాపంటూ అంతటితో ఆపంటూ తెల్లారిపోనిస్తానా
చెలిగాలి మరి చంపితినే వేళ
జంట చలి పెంచుకునే వేళ
చెలిగాలి మరి చంపితినే వేళ
జంట చలి పెంచుకునే వేళ
రమ్మంటావా సందిళ్ళకి
ఒంటిగుండి చావలేనె సలపరింత గోలకి

సాయంకాలం
సాగర తీరం
నా చెలివొళ్ళో
చలి సందళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా
సాయంకాలం
సాగర తీరం
సాయంకాలం
సాగర తీరం



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link