Pedave Palikina

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే... అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే... అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలిగుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా ఔతుండగా జో లాలి పాడనా కమ్మగా కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే... అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పొత్తిళ్లో ఎదిగే బాబు
నా ఒళ్లో ఒదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవ్వనా
నా కొంగు పట్టేవాడు, నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్లు సాకనా చల్లగా చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దులకన్నా జోజో
బంగరు తండ్రి జోజో బజ్జో లాలి జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దులకన్నా జోజో
బంగరు తండ్రి జోజో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో

Credits
Writer(s): A R Rahman, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link