Sitamma Vakitlo

ఏకువలోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటైయ్యింది
ఏకువలోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటైయ్యింది
పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి అహ సిగ్గంతా చీర కట్టింది
చీరలో చందమామా ఎవ్వరమ్మ ఆ గుమ్మ సీతమ్మ
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పే తంతెందుకండి
కోదండరామయ్య వస్తున్నాడండి
రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మ ఏదో మాయ
రానే వచ్చాడోయమ్మ ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మ ఏదో మాయ

సీతకి రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకశం వియ్యమొందే వేళిది
మూడు ముళ్లు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా... ఓ
ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీ సీతమ్మా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట
ఆ మాట విన్నావా రామా అంటుంది
రామా రామా అన్నది ఆ సీత గుండె
అన్ననాడే ఆమెకు మొగుడయ్యాడే

చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంటా చుట్టూ చెట్టూ చేమా... ఓ
పంట పండిందంటూ పొంగి పోయిందమ్మ ఇదిగో ఈ సీతమ్మ



Credits
Writer(s): Ananth Sriram, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com

Link