Atu Itu Ooguthu

అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది
చకచక దూకుతూ తడబడి తుళ్లుతూ
తలపుని తరుముతోంది వయసుకేమయింది
నీ వలనే ఇదిలా మొదలైందే, నా మాటే వినదే

ప్రేమా ఏ? నా ప్రాణం తింటావు
నిన్నే తలచే వరకు
ప్రేమా ఏ? నా వెంటే ఉంటావు
నీలా మారే వరకు

అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది

జాబిలికి జలుబును తెచ్చే చలువ నీదే
సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే
మేఘమును మెలికలు తిప్పే మెరుపు నీవే
కాలముని కలలతో నింపే కథవి నీవే
మౌనం నీ భాషైతే చిరునవ్వే కవితౌతుందే
నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే
నీ వలనే ఇదిలా అవుతోందే, నా మాటే వినదే

ప్రేమా ఏ? నా ప్రాణం తింటావు
నిన్నే తలచే వరకు
ప్రేమా ఏ? నా వెంటే ఉంటావు
నీలా మారే వరకు

అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది

మామూలుగ అనిపిస్తుందే నువ్వు వస్తే
మాయవని తెలిసొస్తుందే లోతు చూస్తే
మంటవలె వెలుగిస్తావే దూరముంటే
మంచువలె లాలిస్తావే చేరువైతే
విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అంతం
నువు పూస్తే నూరేళ్లూ విరిసేను జీవితం
నీ వలనే ఇదిలా జరిగిందే, నా మాటే వినదే

ప్రేమా ఏ? నా ప్రాణం తింటావు
నిన్నే తలచే వరకు
ప్రేమా ఏ? నా వెంటే ఉంటావు
నీలా మారే వరకు

అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమయింది



Credits
Writer(s): Ananth Sriram, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com

Link