Ninu Choosthunte

హే నిను చూస్తుంటె చెడిపోతానే తప్పనుకోవు కదా
పోగిడావంటె పడిపోతానే తప్పని గొడవ కదా
పద పద అంటుందే హాయ్ పదే పదే నీ అందం
అహ మహ బాగుందే హాయ్ మతే చెడి ఆనందం
నురగలెత్తే యవ్వనం తరుముతుంటే కాదనం
సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటె చెడిపోతానే తప్పనుకోవు కదా
పోగిడావంటె పడిపోతానే తప్పని గొడవ కదా

తీగ నడుము కదా ఊగి తడబడద
రేకు విరిసిన సోకు పరువుకు సాయపడమనదా
ఆడ మనసు కదా బైట పడగలద
అంత సులువుగా అంతు దొరకదు వింత పొడుపు కథ
కబురు పంపిన పై యద ఇపుడు వెయ్యకు వాయిదా
సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటె చెడిపోతానే తప్పనుకోవు కదా
హో పోగిడావంటె పడిపోతానే తప్పని గొడవ కదా

లేడీ కన్నులతో వగలాడి వన్నెలతో
కంటపడి మహా కొంటెగా కవ్వించు తుంటరివో
వాడి తపనలతో మగవాడి తహతహతో
జంట పడమని వెంటపడి వేధించు తొందరవో
పెదవి అంచున ఆగిన అసలు సంగతి దాగునా
సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటె చెడిపోతానే తప్పనుకోవు కదా
హో పోగిడావంటె పడిపోతానే తప్పని గొడవ కదా



Credits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link