Okariki Okarye

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే
అడిగినవన్నీ ఇస్తుంటే

అవసరమే తీరుస్తుంటే
ప్రేమంటారా కాదంటారా
ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే

దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే
గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే
కష్టం కలిగిన ప్రతిపనిలో సాయం చేస్తుంటే
విజయం పొందిన వేళలలో వెనుదట్టి మెచ్చుకుంటే
దాపరికాలే లేకుంటే లోపాలను సరిచేస్తుంటే
ఆటాపాటా ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే
ప్రేమంటారా
కాదంటారా

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే

ఓ మనోహరీ చెలీ సఖీ
ఓ స్వయంవరా దొరా సఖా
మనసు నీదని మనవి సేయనా సఖీ
బ్రతుకు నీదని ప్రతినబూననా సఖా
నినుచూడలేక నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ
నీ చెలిమిలేని క్షణములోన జగతిని
జీవింపజాలనోయ్ సఖా

నటనకు జీవం పోస్తుంటే
ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే
అటుపై సెలవని వెళుతుంటే
నీ మనసే కలవర పడుతుంటే
ప్రేమంటారా
జౌనంటాను



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link