Prema Prema

ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ
ఎక్కడ ఉంది ఈ మహిమ ఈ మహిమ ఈ మహిమ
చివరికి దేవునికైనా లేదు నీ ధీమ
ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ
చివరికి దేవునికైనా లేదు నీ ధీమ
ఊహలలో విరిసే ఊపిరిలో కలిసే
మనసంతా మెదిలి నదిలాగా కదిలి
పులకింతలాగ గిలిగింతలాగ మురిపించినావులే
ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ
చివరికి దేవునికైనా లేదు నీ ధీమ

ప్రేమనిక అమృత దేవతగా లోకమున చెబుదామా
ప్రేమకొక అద్భుత కోవెలనే మొదలు ఇక పెడదామా
ఇంపు సొంపు ఇటు కలవగా చప్పునిక గోడలు కడదామా
హంగు రంగు రంగరించి పంపికలు చేద్దామా
ఈ మనసు, ఈ మమత మనసారా చూపుదామా
ఈ తనువే తనకిచ్చి మన పొంగు చూపుదామా
ఈ జగమే తనది
తన వరమే మనది
మన జంట ఇంక తన పంట అంటూ కంట్లోన దాచదా
ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ
చివరికి దేవుని కైనా లేదు నీ ధీమ

చంద్రునికి నూలొక పోగేసి చందనం అద్దేదా
వెన్నెలను కన్నుల తాగేసి బందనం చేసెదా
వాన విల్లు వంచుకొచ్చి మాలగా మెడలో వేసేనా
తేనె వాగు పొంగు తెచ్చి స్నానమే పోసేదా
నీ తలలో నీ తలపే తెలిమల్లె పువ్వు కాదా
నా మదిలో నీ మధువే గోదారి నవ్వు కాదా
నా కలలే నీవి
నా ఇలలో దేవి
నిన్నంటు దోచి నా కంట దాచి వెన్నంటి ఉండనా
ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ
చివరికి దేవునికైనా లేదు నీ ధీమ
ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ
చివరికి దేవునికైనా లేదు నీ ధీమ
ఊహలలో విరిసే ఊపిరిలో కలిసే
మనసంతా మెదిలి నదిలాగా కదిలి
పులకింతలాగ గిలిగింతలాగ మురిపించినావులే
ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ
చివరికి దేవునికైనా లేదు నీ ధీమ



Credits
Writer(s): Sai Sri Harsha, Gilla Chakradhar
Lyrics powered by www.musixmatch.com

Link