Kanulara Chuddam

అసుర గణమున ఉసురు నణచగా
ఇలకు దిగు నరసింహమ
కలడు కలడను అసుర శిశువుకు
శరణు నొసగిన దైవమా
ప్రణయ నరసింహా
విజయ నరసింహా
హింస నణచినా ఉగ్ర సింహ
పరమ హంస భావన
సిరుల రాణి ధీరుల నవ్వే
వరములే నారాయణ

కనులార చూద్దాము కదిలి రారమ్మ
పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా
లక్ష్మి నరసింహ కళ్యాణం
భువికి దిగివచ్చే దివ్య వైభోగం
గగనమంతా పందిరయి
భువనమే సుమ వెదికయి
కళ్యాణం జరిగేనమ్మా కనుల పండువుగా
ఈ జగాన జరగనట్టి దేవతార్చనగా
ఏ యుగాలు ఎరగనట్టి మంత్ర పుష్పముగా
కనులార చూద్దాము కదిలి రారమ్మ
పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా

పోగలతో మంత్రాల ఘోష రగులుతుంటే ముచ్చట
వగలతో శ్రీవారి పైన విసురు చూపే ముచ్చట
సిరికి హరియే సరి అనేటి సరసమింక ముచ్చట
జగమునేలే జవ్వనాలకు మూడు జగములు మొక్కగా
శుభములన్ని చుట్టములుగా కళలని వరకట్నములతో
ధర్మపురిగా యాదగిరిగా మంగళార్చన శిఖరిగా
సింహగిరి కల్యాణ వేదిక మెరిసే కన్నులు పండుగ
కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ
కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ

తారాలన్నీ తలంబ్రాలే తలకు చేరే ముచ్చట
నింగి నెలలు మృదంగలై మేళమయ్యే నిచ్చట
తెరల చాటున చొరవ చేసే బాలకృష్ణుడి లీలట
తాళి కట్టే వేళా సిరి మీద అల్లిబిల్లిగా గిల్లుట
అల్లుడైన గిల్లుడైన పెళ్లికొడుకే హరి అట
వేదగిరిగా అంతర్వేదిగా అహోబిలగిరి శిఖరిగా
సింహగిరి కల్యాణ వేదిక మెరిసే కన్నులు పండుగ
కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ
కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ

కనులార చూద్దాము కదిలి రారమ్మ
పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Chakradhar Gilla
Lyrics powered by www.musixmatch.com

Link