Alai Pongeraa

అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగేరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా
నీ నవరస మోహన వేణుగానమది
అలై పొంగెరా కన్నా

నిలబడి వింటూనే చిత్తరువైనాను
నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రాదొరా ప్రాయమున
యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా

కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలతో పొంగే
కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికె వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే

అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిషాంత మహీత శకుంతమరంద మెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలే రచించవా
కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో యెద తగువో ఇది ధర్మం అవునో
ఇది తగునో యెద తగువో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ

అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగేరా
నీ ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా, కన్నా



Credits
Writer(s): A Rahman, Veturi Murthy
Lyrics powered by www.musixmatch.com

Link