Rama Namame

ప్రాతః స్మరామి హనుమంతం అనంత వీర్యం
శ్రీ రామ చంద్ర చరణాంబుజ చంచరీకం
లంకా పురీ దహన నందిత దేవ బృందం
సర్వార్ధ సిద్ధి సదనం ప్రదిత ప్రభావం

రామ నామమే నీ శ్వాస
రామ గానమే నీ ఆశ

రామ నామమే నీ శ్వాస
రామ గానమే నీ ఆశ
ఎక్కడ రాఘవ భజన జరుగునో
ఎక్కడ రాఘవ భజన జరుగునో అక్కడ నిలుచును నీ ధ్యాస
నమో ఆంజనేయ జయ జయ నమో వజ్రకాయ
నమో ఆంజనేయ జయ జయ నమో వజ్రకాయ

ఏ మధుర రాగము ఆలపించితే
ఏ మధుర రాగము ఆలపించితే ఎద పొంగును నీకు
ఏ నాద రీతిని అనుసరించితే ఆనందమగును నీకు
ఏ మధుర రాగము ఆలపించితే ఎద పొంగును నీకు
ఏ నాద రీతిని అనుసరించితే ఆనందమగును నీకు
ఎటుల మెప్పింతునో, ఎదుట రప్పింతునో
ఎటుల మెప్పింతునో, ఎదుట రప్పింతునో
మదిలోని పాట వినిపించి నిన్ను మురిపించి నేను మరపింపజేతునో
నమో ఆంజనేయ జయ జయ నమో వజ్రకాయ
నమో ఆంజనేయ జయ జయ నమో వజ్రకాయ

శ్రీ రామ నామమున రాగములన్నీ రవళించును నీకు
ప్రియ విభుని గీతిలో భావములన్నీ వినిపించును నీకు
శ్రీ రామ నామమున రాగములన్నీ రవళించును నీకు
ప్రియ విభుని గీతిలో భావములన్నీ వినిపించును నీకు
ఇన కులాధీశుని ప్రణవ మంత్రంమ్మునే
ఇన కులాధీశుని ప్రణవ మంత్రంమ్మునే
మారుతి నీవు జపియించి తనువు పులకించి స్వామి తరియించి పోదువు
రామ నామమే నీ శ్వాస
రామ గానమే నీ ఆశ
రామ నామమే నీ శ్వాస
రామ గానమే నీ ఆశ
ఎక్కడ రాఘవ భజన జరుగునో
ఎక్కడ రాఘవ భజన జరుగునో అక్కడ నిలుచును నీ ధ్యాస
నమో ఆంజనేయ జయ జయ నమో వజ్రకాయ
నమో ఆంజనేయ జయ జయ నమో వజ్రకాయ
నమో ఆంజనేయ జయ జయ నమో వజ్రకాయ
నమో ఆంజనేయ జయ జయ నమో వజ్రకాయ



Credits
Writer(s): Dr. V. Saikrishna Yachendra, Madhavapeddhi Suresh Chandra
Lyrics powered by www.musixmatch.com

Link