Teppaga Marrakumeeda

తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు
తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
మోతనీటి మడుగులో ఈతగరచినవాడు
పాతగిలే నూతిక్రింద బాయనివాడు
మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు
మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు
రోతయైన పేగుల పేరులు గలవాడు

తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు
తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
కోడికూత నోరివాని కుర్ర తమ్ముడైనవాడు
బూడిద బూసినవాని బుద్ధులవాడు
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు
దూడల నావుల గాచి దొరయైనవాడు

తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు
తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
ఆకసానబారే ఊరి అతివల మానముల
కాకుసేయువాడు తురగముపైవాడు
ఏకమై మత్స్య కూర్మో వరాహచః
నారసింహచః వామనః
రామో రామచః కృష్ణచః
భౌద్దః కల్కి రేవచః
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి
ఏ కాలము బాయని యెనలేని వాడు

తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు
తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link