Om Shanthi - From "Challenge"

ఓం శాంతి ఓం శాంతి
వయ్యారి వాసంతి
నీ ఈడులో ఉంది వేగం
నీ తోడు నాకుంది భాగం
చంకి చక్కక చం చకచంచక చచకచం
చంకి చక్కక చం చకచంచక చచకచం
ఓం శాంతి ఓం శాంతి
నీదేలే పూబంతి

ఒంపు ఒంపున హంపి శిల్పమే చూశా... కన్నేశా
లేత నడకలో హంస గమనమే చూశా... కాజేశా
కన్నెనడుమా? కల్పనా?
కవులు పాడే కావ్యమా
కదిలి వచ్చే శిల్పమా
కరిగిపోనీ స్వప్నమా
నీ ఊహలో ఇలా
ఉప్పొంగునా అల
ఉయ్యాలలూగి యవ్వనాలా నవ్వులన్నీ నీవే కావా
ఓం శాంతి ఓం శాంతి
వయ్యారి వాసంతి
నీ చూపు నా పూల బాణం
నీ ఊపిరే నాకు ప్రాణం
చంకి చక్కక చం చకచంచక చచకచం
చంకి చక్కక చం చకచంచక చచకచం
ఓం శాంతి ఓం శాంతి

నీదేలే పూబంతి

నీలవేణిలో కృష్ణవేణినే చూశా... ముడి వేశా
పడతి కొంగులో కడలి పొంగులే చూశా... చుట్టేశా
మేని విరుపా? మెరుపులా?
బుగ్గ ఎరుపా? వలపులా?
నీలికనులా? పిలుపులా?
మత్తులా? మైమరపులా?
నీ చూపుతో ఇలా... వేశావు సంకెల
ఇన్నాళ్ళ నుంచి వేచి ఉన్న వెన్నెలంతా నీదే కాదా
ఓం శాంతి ఓం శాంతి
వయ్యారి వాసంతి
నీ ఈడులో ఉంది వేగం
నీ తోడు నాకుంది భాగం
చంకి చక్కక చం చకచంచక చచకచం
చంకి చక్కక చం చకచంచక చచకచం



Credits
Writer(s): Ehsaan Noorani, Anand Bakshi, Laxmikant Kudalkar, Pyarelal Sharma, Aloysuis Peter Mendonsa, Farhad Wadia
Lyrics powered by www.musixmatch.com

Link